'క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

NRML: వేసవి కాలంలో క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పీడీ అన్నపూర్ణ అన్నారు. సారంగాపూర్ మండలంలోని చించోలి బీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరం శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. ఈనెల 31 వరకు ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుందని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.