జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
అన్నమయ్య: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 124 పరీక్ష కేంద్రాల్లో 22,149 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేసి, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.