అమెరికా భారీ క్షిపణి ప్రయోగం
అమెరికా సైన్యం కాలిఫోర్నియాలోని వాండెన్‌బెర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి 'మినిట్‌మ్యాన్-3' అనే భారీ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని (ICBM) విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు US స్పేస్ ఫోర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, తన అణు సామర్థ్యాన్ని, రక్షణ సన్నద్ధతను చాటుకునేందుకే US ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.