'మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం దారుణం'
ASR: గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చారని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి తెలిపారు. ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు వైద్యం చేరువ చేయాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం దారుణమన్నారు.