రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: అభివృద్ధి యజ్ఞంలో భాగంగానే అవసరమైన ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఇవాళ ఏలూరులో రోడ్డు విస్తరణా పనులను పరిశీలించిన ఆయన అనంతరం ఆ ప్రాంతంలోని దుకాణ యజమానులతో స్వయంగా మాట్లాడారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనాలు పార్కింగ్‌ చేసేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.