26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు

TPT: తిరుమల శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. శుక్రవారం స్వామి వారిని 70,480 మంది భక్తులు దర్శించుకోగా, 28,923 మంది తలనీలాలు సమర్పించారు. రూ.3.17 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.