VIDEO: సమాజంలో మహిళల పాత్ర మరువలేనిది: ఎమ్మెల్యే
కోనసీమ: సమాజంలో మహిళలు పాత్ర మరువలేనిదని, మహిళలు ముందంజ వేస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి వాడపాలెంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.