డిగ్రీలో ప్రవేశాలకు చివరి అవకాశం

SRD: పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు ఈనెల 12 ఆఖరి తేదీ అని ప్రిన్సిపాల్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. దోస్త్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకొని సీటు పొందినవారు సంబంధిత ధ్రువపత్రాలతో కళాశాలలో రిపోర్ట్ చేయాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.