నేడు కర్రెగుట్టలకు డీజీపీ
TG: డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు ఇవాళ కర్రెగుట్టల ప్రాంతంలో పర్యటించనున్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులను కలుపుతూ నిర్మించిన నూతన రహదారిని పరిశీలించనున్నారు. ఈ రహదారి వల్ల అంతర్రాష్ట్ర రవాణా మెరుగుపడటమే కాకుండా, సరిహద్దుల్లో పోలీసుల నిఘా మరింత కట్టుదిట్టం కానుంది. అలాగే గుత్తికోయలతో డీజీపీ సమావేశం కానున్నారు.