లావేరు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

లావేరు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

SKLM: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా లావేరు శాఖా గ్రంథాలయములో గురువారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పుస్తకము మంచి నేస్తం వంటిదని, విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చి, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. వివిధ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సహాయకులు వీరభద్రుడు ఉన్నారు.