వేగవంతంగా పన్నులు వసూళ్లు చేయాలి : మున్సిపల్ కమిషనర్

WNP: అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ సూచన మేరకు వందరోజుల ప్రణాళికలో భాగంగా శనివారం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో సిబ్బంది పర్యటిస్తూ పన్నులు వసూలు చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా పన్ను చెల్లించకుండా పెండింగ్లో ఉన్నవారికి నోటీసులు జారీ చేయాలని అన్నారు.