గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అరెస్టు

ELR: భీమడోలులో శనివారం చేపట్టిన వాహన తనిఖీల్లో గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని పట్టుకున్నట్లు ఏలూరు డీఎస్పీడీ శ్రావణ్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 40 వేలు విలువైన 2.13 కిలోల గంజాయి, రెండు మోటారు సైకిళ్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ విల్సన్, ఎస్సై సుధాకర్ పాల్గొన్నారు.