అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
W.G: ఆచంట మండలంలో జిల్లా పరిష్యత్ నిధులు రూ. 33.5 లక్షలు అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఆచంటలో కైలాసధామంకు వెళ్లే రహదారి, పోరలో కల్వర్టు నిర్మాణం, కరుగోరుమిల్లిలో ముత్యాలవారిపాలెం, వల్లూరులో నీరుల్లిపాలెం, మట్టపర్తివారిపాలెంలలో సీసీ రహదారులకు శంకుస్థాపన చేశారు.