'ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి'
కోనసీమ: అంతకమైన ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని మామిడికుదురు మండలం పాసర్లపూడి జడ్.పి.హెచ్ స్కూల్ హెచ్ఎం రమాదేవి పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సరైన జీవన విధానాలు పాటిస్తూ శాస్త్రీయంగా ఆలోచించి ఎయిడ్స్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు అన్నారు.