VIDEO: టాటా ఏస్ వాహనం బోల్తా.. 10మందికి గాయాలు

WGL: కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రాయపర్తి మండలం బంధనపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. డీసీ తండా గ్రామానికి చెందిన కూలీలు భవన నిర్మాణ పనులకు వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. గాయాలైన వారిని వర్ధన్నపేట ఆసుపత్రికి తరలించారు.