వెలిచాల క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

KNR: కొత్తపల్లి లోనివెలిచాల ప్రజా కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యాలయంలో ప్రతిష్టించిన గణనాథుడి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమృద్ధి వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.