జిల్లా ఆసుపత్రికి ఆధునిక పరికరాలు అందజేత
నారాయణపేట జిల్లా ఆసుపత్రికి గురువారం ఎంపీ డీకే అరుణ అంబియన్స్ పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి జ్ఞాపకార్థం ఎండోస్కోపిక్ ఆపరేషన్ పరికరాలను అందించారు. అనంతరం వినికిడి లోపం ఉన్నవారికి ఉచితంగా వినికిడి పరికరాలను అందించారు. ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.