'రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది'
JGL: రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని జీవన్ రెడ్డి నివాసంలో బాబు జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం పోరాటం చేశారని ఆయన సేవలను స్మరించుకున్నారు.