పురాతన నాణేల కోసం నంది విగ్రహం ధ్వంసం..?

పురాతన నాణేల కోసం నంది విగ్రహం ధ్వంసం..?

SKLM: సోంపేట మండలంలోని బారువ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో అదృశ్యమైన నంది విగ్రహం సమీప పంట పొలాల్లో ధ్వంసమైన స్థితిలో దర్శనమిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విగ్రాహాన్ని పరిశీలించారు. సీఐ మంగరాజు నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పురాతన నాణేల కోసం ఈ దుశ్చర్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.