'జన గణన విధుల్లో పారదర్శకత పాటించాలి'

'జన గణన విధుల్లో పారదర్శకత పాటించాలి'

WNP: జన గణన-2026 విధుల కేటాయింపులో సర్వీస్ సీనియార్టీని పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయులకు విధులను కేటాయించాలని తపస్ పెద్దమందడి మండల శాఖ అధ్యక్షుడు ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి రవికుమార్లు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘం తపస్ పెద్దమందడి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మార్వో పాండు నాయక్‌కు అందుకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు.