నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు

నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు

MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన నల్ల పోచమ్మ దేవాలయంలో శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. అమ్మవారికి నిమ్మకాయల మాలతో కుంకుమార్చన నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.