ఉడాయ్‌ నుంచి కొత్త ఆధార్‌ యాప్‌

ఉడాయ్‌ నుంచి కొత్త ఆధార్‌ యాప్‌

భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు తమ ఆధార్ వివరాలను ఫోన్‌లో సేవ్ చేసుకోవటం, అవసరమైన వివరాలను ఇతరులతో సులువుగా పంచుకోవటం కోసం ఈ యాప్‌ను తీసుకువచ్చినట్లు ఉడాయ్ తెలిపింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.