VIDEO: గోవుల లారీని అడ్డుకున్న బీజేపీ నాయకులు
MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ లారీని గో రక్షణ సమితి, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. కంటైనర్ లారీలో గోవులు తరలిస్తున్నారన్న సమాచారంతో అంబేద్కర్ చౌరస్తా వద్ద లారీని అడ్డగించిన నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.