కపిలతీర్థంలో కోదండరాముడి చక్రస్నానం
తిరుపతి: శ్రీకోదండరామస్వామివారి చక్రస్నానం ఎంతో వైభవంగా జరిగింది. కపిలతీర్థం పుష్కరిణిలో ఈ పవిత్ర వేడుకను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మణులతో పాటు చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకాలు స్వీకరించి భక్తులకు కటాక్షం ప్రసాదించారు.