మరణంలోనూ ఇద్దరికీ పునర్జన్మ

మరణంలోనూ ఇద్దరికీ పునర్జన్మ

JGL: రాయికల్ పట్టణం శివాజీ నగర్‌కు చెందిన చొప్పదండి నర్సయ్యను ఈనెల 23న గుర్తు తెలియని వాహనం ఢీకొనగా, చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన 'బ్రెయిన్ డెడ్'కు గురయ్యారు. మృతుడి భార్య ఆండాలు, కుమారుడు సురేశ్ అంగీకారంతో నర్సయ్య కు చెందిన లివర్, ఊపిరితిత్తులను దానం చేసి, మరణంలోనూ నర్సయ్య మరో ఇద్దరి ప్రాణాలకు జీవం పోశారు.