VIRAL: 109 KM వేగం.. గాల్లోకి ఎగిరిపడ్డ బాలుడు
రోడ్డు దాటబోతున్న ఓ బాలుడిని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు డాష్‌కామ్‌లో రికార్డైన ఈ ప్రమాదంలో బాలుడు గాల్లోకి ఎగిరి కొంతదూరం పడిపోయాడు. ప్రమాదం జరిగినప్పుడు కారు 109 కి.మీ. వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని కొందరు, అజాగ్రత్తగా రోడ్డు దాటడం బాలుడి తప్పని మరికొందరు వాదిస్తున్నారు.