పీఆర్సీ అమలు చేయాలని వినతి
NRPT: TGEJAC రాష్ట్రస్థాయి పిలుపు మేరకు మండలంలోని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు బకాయిల విడుదల, పీఆర్సీ అమలు కొరకై దామరగిద్దలో నిరసన చేపట్టారు. మూడు సంవత్సరాల నుంచి పెండింగులో ఉన్న పీఆర్సీని కాలయాపన చేయకుండా శివ శంకర్ కమిటీ నుంచి నివేదికను తెప్పించి జూన్ 2 కంటే ముందే 51% ఫీట్మెంట్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.