బస్సును ఢీకొన్న బైక్ .. యువకుడు మృతి
TPT: తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటరెడ్డి (25) అక్కడికక్కడే మృతి చెందాడు అతని సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి బస్సు అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ వెంకటేష్ నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.