గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై

NLG: గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని మర్రిగూడ ఎస్సై మునగాల కృష్ణారెడ్డి అన్నారు. అందుకోసం https://policeportal.tspolice.gov.in/index.htm అనే పోలీస్ పోర్టల్లో ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఘర్షణలకు తావు లేకుండా, ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన కోరారు.