VIDEO: పర్యాటకులతో కళకళలాడిన చాపరాయి జలపాతం
ASR: డుంబ్రిగూడ మండలం చాపరాయి జలపాతం శనివారం పర్యాటకులతో కళకళలాడుతూ సందడి నెలకొంది. రోడ్డుకు ఇరువైపుల కార్లు బారులు తీరాయి. వారాంతం కావడంతో చాపరాయి జలపాతానికి పర్యాటకుల రాక పెరిగిందని సిబ్బంది తెలిపారు. జలపాతం వద్ద మహిళా పర్యాటకులు గిరిజన అలంకరణలతో ఫొటోలు తీసుకుంటూ సంతోష పడుతున్నారు. నీటిలో కేరింతలు కొడుతూ, జారుతూ సరదా అనుభూతిని పొందుతున్నారు.