'లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించండి'

'లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించండి'

కామారెడ్డిలోని 40వ వార్డులో లో వొల్టేజ్ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. హనుమాన్ ఆలయం వెనుక ఓ ట్రాన్స్ ఫార్మర్, మాజీ MLA గంప గోవర్ధన్ ఇంటి చౌరస్తాలో మరో ట్రాన్స్ ఫార్మర్ మాత్రమే ఉండటంతో లోడ్ పెరిగి సమస్యలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. కాలనీలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. AAE వెంకటేష్‌కు ఇవాళ వినతి పత్రం అందజేశారు.