ఘనంగా రన్ ఫర్ జీసస్
PDPL: రన్ ఫర్ జీసస్ పేరుతో నిర్వహించిన క్రైస్తవ ఐక్యతా ర్యాలీ గోదావరిఖని 5 ఇంక్లెన్ చౌరస్తా వద్ద ఘనంగా జరిగింది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మధ్య వచ్చే హోలీ శనివారం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు యేసు క్రీస్తు పునరుత్థానం, ప్రేమ సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. ర్యాలీలో పాల్గొన్న భక్తులు బ్యానర్లతో సందేశాన్ని తెలిపారు.