KGBVలో దరఖాస్తుల ఆహ్వానం
KRNL: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 2026- 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు సమగ్ర శిక్షా ఏపీసీ లోకరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్లూరు, ఆదోని కేజీబీవీల్లో మైనారిటీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈనెల 12 నుంచి ఏప్రిల్ 15 వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.