నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
BDK: చర్ల పంచాయతీ కార్యాలయం నుంచి విద్యుత్ ఉపకేంద్రం వరకు విద్యుత్ లైన్లో మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పంచాయతీ ఆఫీస్ నుంచి లింగాపురం పాడు విద్యుత్ ఉపకేంద్రం వరకు, సీఆర్ కాలనీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.