ప్రతిభ గల విద్యార్థులకు నగదు పంపిణీ

KDP: ప్రతిభ గల పది మంది విద్యార్థులకు రూ. 25 వేలు నగదును బయోస్టాడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ సీనియర్ సేల్స్ మేనేజర్ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. బుధవారం మండల పరిధిలోని పెద్దపసుపులలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్.ఎం జరీనాతో మాట్లాడి నగదును అందజేశారు. ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలలో చదివే 10 మంది ప్రతిభ గల విద్యార్థులను ఇలా ప్రోత్సహిస్తున్నామన్నారు.