యోగ, ఆయుష్ సేవల విస్తరణపై ప్రశ్నించిన ఎంపీ

యోగ, ఆయుష్ సేవల విస్తరణపై ప్రశ్నించిన ఎంపీ

HNK: దేశంలో యోగా ప్రచారం, హర్బల్ ఔషధాల నాణ్యత, గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవల విస్తరణ వంటి కీలక అంశాలపై లోక్ సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్వహించిన జాతీయ, ప్రాంతీయ యోగా క్యాంపైన్‌ల వివరాలు, వాటిలో పాల్గొన్న వారి సంఖ్య, కేటాయించిన బడ్జెట్‌ను వివరించాలని ఆమె కేంద్రాన్ని కోరారు.