'పిల్లలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలి'

'పిల్లలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలి'

ADB: పిల్లలు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్ సూచించారు. గురువారం భీంపూర్ మండలంలోని దన్నోర ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను అందజేసినట్లు పేర్కొన్నారు. రోజువారి ఆహారంలో కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని కోరారు.