రేపటి నుంచి పశువులకు టీకాలు పంపిణీ

రేపటి నుంచి పశువులకు టీకాలు పంపిణీ

NDL: రుద్రవరం మండలంలో వివిధ గ్రామాలలో సోమవారం నుంచి పశువులకు గాలికుంటు వ్యాధినివారణ టీకాలు పంపిణీ చేయనున్నట్లు మండల పశువైద్యాధికారి మనోరంజన్ వెల్లడించారు. పాడి పశువులు కలిగిన ప్రతి ఒక్కరూ పశువైద్య సిబ్బందిని సంప్రదించి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఆవులు ఎద్దులు గేదెలు ఇలా అన్ని రకాల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలన్నారు.