'ఉపాధి హామీ చట్టం అమలులో కూటమి విఫలం'

E.G: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆరోపించారు. శనివారం గోపాలపురం నియోజవర్గం ద్వారకాతిరుమల, తిమ్మాపురంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఉపాధి హామీ చట్టం తీసుకొని రావడంలో సంఘం కృషి ఉందన్నారు.