రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ELR: నూజివీడు బస్టాండ్ సమీపంలో శనివారం ఆగి ఉన్న బైక్‌ను వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలు జూనపూడి తిరుపతమ్మ, ఆమె కుమారుడు శేఖర్ బాబులకు తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై పోలీసులకు తెలపగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.