మోదీతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నా: ట్రంప్

మోదీతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నా: ట్రంప్

భారత్‌తో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. 'ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యను అధిగమించడానికి చర్చలు కొనసాగుతున్నాయి. మరికొన్ని వారాల్లో నా మిత్రుడు ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా. ఈ సమావేశంలో రెండు గొప్ప దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఫలప్రదంగా ముగుస్తాయని భావిస్తున్నా' అని ట్రూతో సోషల్‌లో పోస్టు చేశారు.