ఎల్లంపల్లి ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత

ఎల్లంపల్లి ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత

TG: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ సాగర్, కడెం ప్రాజెక్టు, నది పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 24 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.64 మీటర్లకు చేరుకుంది.