VIDEO: విమానం అలంకరణలతో వినాయక మండపం

VZM: బొబ్బిలి పట్టణం మల్లంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రత్యేకంగా విమానం రూపకల్పనలో చేసిన ఈ మండపం, గ్రామస్తులు మాత్రమే కాకుండా పట్టణం నలుమూలల నుంచి వచ్చిన భక్తులకూ ఆసక్తికరంగా మారింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ మండపం ముందు నిలబడి చిత్రాలు తీసుకుంటూ, వినాయకునికి నమస్కరించారు.