నేడు కొండ బిట్రగుంటలో తెప్పోత్సవం

నేడు కొండ బిట్రగుంటలో తెప్పోత్సవం

NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం రాత్రి 7:30 నిమిషాలకు తెప్పోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.