'ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు.. మట్టి విగ్రహాలే ముద్దు'

'ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు.. మట్టి విగ్రహాలే ముద్దు'

PPM: పాలకొండ పరిధిలో యాలం జంక్షన్లో మంగళవారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఎస్సై ప్రయోగమూర్తి, టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు కొండబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మట్టి విగ్రహాల వల్ల పర్యావరణాన్ని కాపాడే దిశగా ముందుకు అడుగులు వేయాలని వారు పిలుపునిచ్చారు. వీరితో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షుడు సంతోష్, కౌన్సిలర్లు బాజ్జి, రాంబాబు ఉన్నారు.