ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక భేటీ

TG: మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో హరీశ్‌రావు, వినోద్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డి, దామోదర్ రావు పాల్గొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక, బీసీ సభ, స్థానిక సంస్థల ఎన్నికలు, యూరియా కొరత వంటి అంశాలపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.