చిల్లలవాగు డ్రైనేజీలో గుర్రపు డెక్క తొలగింపు

చిల్లలవాగు డ్రైనేజీలో గుర్రపు డెక్క తొలగింపు

కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పుచ్చగడ్డలో చిల్లలవాగు డ్రైనేజీలో గుర్రపు డెక్క తొలగించారు. గురువారం చిల్లలవాగు వంతెన వద్ధకు ఎగువ నుంచి భారీగా గుర్రపు డెక్క వచ్చి చేరటంతో ఘంటసాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ అయినపూడి భానుప్రకాష్ జేసీబీతో తీయించారు. దీంతో వంతెన వద్ద సమస్య పరిష్కారం కావటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.