ఘనంగా ముగిసిన వ్యాకులమాత పండగ

ఘనంగా ముగిసిన వ్యాకులమాత పండగ

VZM: కొత్తవలస మండలం గొల్లలపాలెం వద్ద ఉన్న కొండడాబాలు వ్యాకులమాత పండగ ఆదివారం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే పండగకు ఉత్తరాంధ్ర, పొరుగున ఉన్న ఒడిశా ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఆఖరిరోజు కావడంతో భక్తులతో రోడ్లు అన్ని కిటకిటలాడాయి. ఎటువంటి అల్లర్లు జరుగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.