దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం ప్రారంభం
VSP: దివ్యాంగుల కోసం ఏపీ ప్రభుత్వం “దివ్యాంగ శక్తి పథకం”ను అమలు చేస్తూ ఉచిత బస్సు సౌకర్యాన్ని బుధవారం ప్రారంభించింది. విశాఖలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగుల రవాణా సమస్యలు తగ్గి, సామాజిక-ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతుందని తెలిపారు.