పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

SRCL: వేములవాడ పట్టణంలోని పద్మశాలి సంఘం ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ నిర్ధారణ కోసం అవసరమైన రక్త పరీక్షలు చేసి మందులను ఉచితంగా అందజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, డాక్టర్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.